చెరువులో గేదెలను కడిగేందుకు దిగిన వ్యక్తి నీట మునిగి మృతిచెందిన ఘటన పెదవేగి కొప్పాకలో శనివారం వెలుగుచూసింది. మృతుడు సాయిబాబా కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం గేదలు మేపేందుకు వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి రాలేదు. శనివారం కొప్పాక చెరువులో మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్బడీని పరిశీలించి కేసు నమోదు చేశారు.