ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఆవరణ నందు శనివారం దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. బస్టాండుకు వచ్చిన మహిళ బ్యాగ్ లో నుంచి దొంగలు 40 వేల రూపాయలు చోరీ చేశారు. నగదు మాయం కావడంతో మహిళా కంటతడి పెట్టింది. స్కూల్ ఫీజు చెల్లించేందుకు అప్పుగా నగదు తెచ్చుకొని వెళ్తున్న సమయంలో దొంగలు కాజేశారని బాధితురాలు వాపోయారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.