కిర్లంపూడి వెలుగు మహిళా మార్ట్ వద్ద డ్వాక్రా గ్రూపు నుంచి నగదును తీసుకుని సరుకులు లేవనడంతో మహిళలు మార్ట్ వద్ద ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇది కిర్లంపూడి వెలుగు మహిళా మార్ట్ తీవ్ర చర్చకు కారణమైంది. డ్వాక్రా మహిళల పొదుపులతో, ప్రభుత్వ సహకారంతో 2023 ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ మార్ట్, ఆశించిన లాభాలు ఇవ్వకపోగా భారీ నష్టాల్లో కూరుకుపోయింది. సుమారు రూ.34 లక్షల పెట్టుబడితో స్థాపించగా, నేడు దాదాపు రూ.10 లక్షల నష్టం వచ్చిందని మహిళలు ఆరోపిస్తున్నారు.