నల్లగొండ పట్టణంలోని బిజెపి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను ఆదివారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బిజెపి నల్లగొండ నియోజకవర్గ నాయకులు పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ బిజెపి పర్యటనలో ప్రధాని మోదీ మాతృమూర్తి పై కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులు బిజెపి నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.