ప్రకాశం జిల్లా పామూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని రజిని రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపికైనట్లుగా శుక్రవారం విద్యా కమిటీ చైర్మన్ కొండలరావు తెలిపారు. గతంలో జిల్లా స్థాయి పోటీలలో రాణించి ప్రథమ స్థానంలో రజిని నిలిచినట్లుగా ఉపాధ్యాయులు తెలిపారు. సెప్టెంబర్ మొదటి వారంలో నెల్లూరు జిల్లా కొవ్వూరులో తిరిగే రాష్ట్రస్థాయి యోగా పోటీలలో రజిని పాల్గొంటుందని అందుకు ఎంపికైనట్లుగా ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థినిని ఉపాధ్యాయులు విద్యా కమిటీ చైర్మన్ అభినందించారు.