తలపూడి మండలం గజ్జరం గ్రామంలో యూరియా కోసం రైతులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రం వద్ద ఉదయం నుంచి శనివారం సాయంత్రం ఐదు గంటల వరకు రైతులు పడిగాపులు కాశారు. ఒక లారీ లోడు యూరియా వచ్చినప్పటికీ అది కొంతమంది రైతులకు మాత్రమే లభించడంతో, మిగిలిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి యూరియాని సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.