వెల్దుర్తిలో మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేసి శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. జెండాలు, బ్యానర్లతో శాంతి, సోదరభావం, ఐకమత్యం బోధనలు చాటి ర్యాలీ చేశారు. పాత బస్టాండ్ వద్ద స్వీట్లు పంచిపెట్టారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.