రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.తల్లాడ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి తల్లాడ HP గ్యాస్ గోడౌన్ వద్ద చోటు చేసుకుంది. పోలీసులు,స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.మృతుడు ది కోదాడ మండలం కాపుగుల్లు గ్రామానికి చెందిన మాధవరపు సైదులు (36) అనే వ్యక్తిగత పనిమీద తల్లాడ మండలంలోని రామానాజవరం గ్రామానికి వెళ్లి తన ద్విచక్ర వాహనంపై తిరిగి తల్లాడవైపు వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు.మృతుడికి భార్య, నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. మృతుడు బార్బర్గా పనిచేస్తూ గత కొంతకాలంగా భార్యాభర్తలిద్దరూ తల్లాడ లోనే నివసిస్తున్నారు.