మానకొండూరు చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్... ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలకు తావివ్వకుండా ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనోత్సవాలను జరుపుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. గురువారం మద్య్హనం కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలో చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రేపు ఉదయం నుండే గణేశ్ విగ్రహాలను త్వరగా నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. భక్తిశ్రద్దలతో, క్రమశిక్షణతో హిందువులంతా ఐక్యంగా ఉంటూ గణేశ్ నిమజ్జనోత్సవాలను దిగ్విజయంగా నిర్వహించడం ద్వారా సమాజానికి కరీంనగర్ నుండి స్పూర