ఆళ్లగడ్డ పట్టణంలో వీధి కుక్కల బెడద రోజురోజుకు పెరిగిపోతుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఏ వీధిలో చూసినా కుక్కల గుంపులు గుంపులుగా సంచరిస్తూ అడ్డు వచ్చిన వారిని, చిన్నపిల్లలను కరిచి గాయపరుస్తున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో కుక్కల బెడద నివారించాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పలు కౌన్సిల్ సమావేశాల్లో కమిషనర్ ను కోరినా ఏమాత్రం పట్టించుకోవడంలేదని ప్రజలు విమర్శిస్తున్నారు.