కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని ముద్దనూరు మండలం ముద్దనూరు ఎంపీడీఓ కార్యాలయ సభాభవనంలో సోమవారం ముద్దనూరు డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల ఎరువుల డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసినట్లు ఎడిఎ రామ మోహన్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు డిఎస్పీ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ యూరియా కొరత లేకుండా ,రైతులకు సమస్య రాకుండా యూరియా పంపిణీ చేయాలన్నారు.ఎరువుల నియంత్రణ చట్టం ప్రకారం వ్యాపార లావాదేవీలు కొనసాగించాలని తెలిపారు. ఎటువంటి సమస్యలు రాకుండా వ్యాపార లావాదేవీలు కొనసాగించాలని తెలిపారు. సిఐ దస్తగిరి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే రైతులకు యూరియాను అమ్మాలన్నారు.