శ్రీ సత్య సాయి జిల్లా బుక్కపట్నంలోని ఎమ్మార్వో కార్యాలయంలో వినాయక చవితి పండుగ సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం శాంతి సమావేశం నిర్వహించారు. తహశీల్దార్ నరసింహులు, ఎస్సై కృష్ణమూర్తి వినాయక మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులకు పలు సలహాలు, సూచనలు అందించారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలు ఏర్పాటుచేసి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని తెలిపారు.