వినాయక మండపాలను నిమజ్జన ప్రాంతాలను వాల్మీకిపురం సీఐ బి.రాఘవ రెడ్డి మంగళవారం పరిశీలించారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని వాల్మీకిపురం సర్కిల్ పరిధిలోని వాల్మీకిపురం, గుర్రంకొండ మండలాల్లో వినాయక మండపాలను, మరియు నిమజ్జన ప్రాంతాలను వాల్మీకిపురం గుర్రంకొండ మండలాల ఎస్ఐ లు చంద్రశేఖర్, రఘురాం లతో కలిసి సీఐ బి.రాఘవ రెడ్డి పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక మండపాలు విద్యుత్ లైన్లు ఉండే చోట ఏర్పాటు చేయరాదన్నారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు