విద్యార్థినిలు చదువుతో పాటు వృత్తి విద్యా కోర్సులలో నైపుణ్యం సాధిస్తే, చదువు అయిపోయిన వెంటనే ఉపాధి పొందవచ్చు అని చిట్వేల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు అన్నారు. చిట్వేల్ ఉన్నత పాఠశాలలో వృత్తి విద్యా కోర్సులలో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను శుక్రవారం ప్రారంభించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ శిక్షకుడు మహమ్మద్ రఫీ మాట్లాడుతూ.. ఆహార పదార్థాల తయారీ విధానంపై విద్యార్థినులకు శిక్షణ ఇస్తామన్నారు. ఇంటర్ తర్వాత విద్యార్థినిలు న్యూట్రిషన్ కోర్సులలో చేరడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందని అన్నారు.