కార్మికొద్యమ నేత ఎర్రజెండ ముద్దుబిడ్డ చామకూరి రాములు అని సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు.ఆదివారం గుండెపోటుతో మృతి చెందిన రాములు పార్థివ దేహాన్ని సిపిఎం నాయకులు సందర్శించి పార్థివదేహం పై సిపిఎం పార్టీ జెండాను కప్పి అమరవీరుల గీతాలు ఆలాపించి ఘనంగా నివాళులర్పించారు.