శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ సమీపంలోని కియా పరిశ్రమ ఎదురుగా హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో బుధవారం ఉదయం 40 వేల మందికి భోజన ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. మంగళవారం ఈ మేరకు అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పార్టీ నాయకులతో కలిసి మంత్రి పరిశీలించారు. జిల్లాలోని పెనుకొండ, హిందూపురం, మడకశిర నియోజకవర్గల నుంచి అనంతపురంలో జరిగే 'సూపర్ సిక్స్ సూపర్ హిట్' కార్యక్రమానికి వచ్చే వారి కోసం ఈ సౌకర్యం కల్పించామని చెప్పారు.