సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలంలోని వినాయక చవితి సందర్భంగా గణేష్ మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని ఎస్సై సైదులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి గణేష్ మండపాల నిర్వహకులు పోలీసుల నిబంధనలకు కచ్చితంగా పాటించాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల నిర్వాహకులు శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు.