శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలో బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పలు కంపెనీల యాజమాన్యంతో సమన్వయం చేసుకుంటూ... యువతకు ఉపాధి కల్పిస్తుందన్నారు. ఈ మెగా జాబ్ మేళాలో ఎంపిక కాబడిన అభ్యర్థులకు ఆఫర్ లెటర్స్ అందించారు.