తల్లాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుడిపల్లి నారాయణ అధ్యక్షతన సోమవారం తల్లాడ పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిరుపేదలకు దుప్పట్ల పంపిణి కార్యక్రమం క్లబ్ గౌరవ సలహాదారు మునుకూరి అప్పిరెడ్డి కుమార్తె,అల్లుడు (ఎన్ఆర్ఐ )ల సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తల్లాడ తాసిల్దార్ సురేష్ కుమార్, ఎంపీడీవో సురేష్ బాబు, తల్లాడ ట్రైనీ ఎస్ఐ బానోతు వెంకటేష్, మరియు ఈవో కృష్ణారావు లు కార్యక్రమానికి హాజరై నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.తొలుత ప్రెస్ క్లబ్ సభ్యుల వివరాలతో కూడిన బ్రోచర్ ను అధికారులు క్లబ్ అధ్యక్షులు చేతుల మీదుగా ఆవిష్కరించారు.