సిర్పూర్ నియోజకవర్గం లోని గిరిజన గ్రామాలలో రోడ్డు పరిస్థితి పూర్తిగా దయనీయంగా ఉందని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మంగళవారం చిన్న మాలిని గ్రామాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సందర్శించారు. అటవీ శాఖ అనుమతులు లేకపోవడంతో రోడ్డు నిర్మాణాలు నిలిచిపోయాయని ఎమ్మెల్యే పై మండిపడ్డారు.