యాడికి మండల కేంద్రానికి చెందిన తస్మీయా ఆఫ్రిన్ ను అదనపు వరకట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్న ఆమె భర్త ఖాదర్ బాషా తో పాటు అత్తమామలపై సీఐ వీరన్న బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. తస్మీయా ఆఫ్రిన్ -ఖాదర్ భాషా కు ఏడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కొంత బంగారు, నగదు కట్నంగా ఇచ్చారు. అయితే గత కొంతకాలంగా అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తున్నారు. ఆఫ్రిన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.