ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ కేంద్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె స్వయంగా మురుగు కాలువలను శుభ్రం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తద్వారా అనారోగ్యానికి గురికాకుండా ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. వైద్యుల సూచనలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రజలకు తెలిపారు.