ఈనెల 13వ తేదీన భీమడోలు కోర్టులో జాతీయ లోక్అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సివిల్ జడ్జి యస్.ప్రియదర్శిని నూతక్కి తెలిపారు. శనివారం భీమడోలు కోర్టు ఆవరణలో దెందులూరు, భీమడోలు, ద్వారకాతిరుమల మండలాలకు చెందిన పోలీస్ అధికారులు, భీమడోలు కోర్టు బార్ అసోసియేషన్ అడ్వకేట్లు, కోర్టు కానిస్టేబుళ్ళతో న్యాయమూర్తి లోక్ అదాలత్ నిర్వహణ పై సమావేశం నిర్వహించారు. అధికారులకు పలు సూచనలు చేసారు. ఈ సందర్బంగా న్యాయమూర్తి మాట్లాడుతూ సెప్టెంబర్ 13వ తేదీ భీమడోలు కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహిస్తున్నామని, కక్షిదారులు వినియోగించుకోవాలని తెలిపారు.