కుషాయిగూడలో రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీకాంత్ రెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భూమి వివాదం, ఆర్థిక లావాదేవీల కారణంగా ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భోగారంలో భూమి సెటిల్మెంట్కు సహాయం చేసినందుకు బౌన్సర్లు డానియల్, ధనరాజ్ కు శ్రీకాంత్ కోటి ఇస్తానని హామీ ఇచ్చి జాప్యం చేశాడు. దీంతో కక్ష పెంచుకున్న ధనరాజు హత్య చేసినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.