జిల్లా జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో NMNF కన్వర్జెన్స్ మీటింగ్ జరిగింది.జిల్లాలో APCNF ప్రస్తుత స్థితి, రైతుల కవరేజీపై సమీక్ష జరిపి, ప్రతి క్లస్టర్‌లో 125 మంది రైతులు, 50 హెక్టార్ల లక్ష్యం మార్చి 2026 నాటికి చేరుకోవాలని నిర్ణయించారు.ప్రతి శాఖకు బాధ్యతలు కేటాయించి, గ్రామాల్లో KAP క్యాంపెయిన్‌లు, జీవామృత తయారీ, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇకపై నెలవారీగా కలెక్టర్ ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్‌లు నిర్వహించనున్నారు.ఈ సమావేశంలో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, DRDA అధికారులు మరియు APCNF జిల్లా బృందం పాల్గొన్నారు.