నేపాల్ రాజాదాని కాఠ్మాండూలో జిల్లా వాసులు చిక్కుకున్నారు. దీనిపై శ్రీకాకుళం కలక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంకు వచ్చిన సమాచారం మేరకు 14 మంది సిక్కోలవాసులు మానససరోవరం యాత్రకు వెళ్లి చిక్కుకున్నారని జిల్లా పాలనాధికారి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. కాఠ్మాండూలో తలదాచుకున్నా వారిని సురక్షితంగా విశాఖకు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టామని గురువారం తెలిపారు.