ఈ నెల 7 వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో గుంటూరు ఆర్టీసీ బస్టాండ్లో సుమారు 50 సంవత్సరాల గుర్తు తెలియని మగ వ్యక్తి ఫిట్స్ వచ్చి పడిపోయినట్లు ఆర్టీసీ కంట్రోల్ రూమ్ నుండి 108 కి సమాచారం రావడం జరిగిందని పాత గుంటూరు సిఐ వెంకట ప్రసాద్ బుధవారం సాయంత్రం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. సదరు వ్యక్తిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు తెలపడం జరిగిందన్నారు. కావున ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఆచూకీ తెలిసినవారు స్థానిక పాత గుంటూరు పోలీసులను సంప్రదించాలని సూచించారు. మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించినట్లు చెప్పారు.