ఏలూరు జిల్లా గోదావరివరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి,జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి గురువారం సాయంత్రం నాలుగు గంటలకు పర్యటించారు.వేలేరుపాడు మండలం చిగురుమామిడి గ్రామాన్ని సందర్శించి బాధితుల సమస్యలు తెలుసుకున్నారు.. స్వయంగా జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్లు గోదావరిపై బోటు పై ప్రయాణించి వరద బాధితుల వద్దకు వెళ్లి వారిని పునరావాస్య కేంద్రానికి తరలించేందుకు చర్యలు చేపట్టారు.. పునరావాస కేంద్రాల వద్ద ఉన్న బాధితులకు తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు