భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి జిల్లాలోని 33 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందించినట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉంటుందని,ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 11 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, రానున్న రోజుల్లో మరిన్ని సౌకర్యాలు ఉపాధ్యాయులకు కల్పిస్తామన్నారు ఎమ్మెల్యే గండ్ర.