గుంతకల్లు మండలం బుగ్గ సంగాల గ్రామంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అంజన్ రెడ్డి (58) అనే రైతు ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న ఎకరాల్లో గత నాలుగేళ్లుగా పంటలు సాగు చేశాడు. పంటల సాగు కొరకు ఇతరుల వద్ద 15 లక్షల వరకు అప్పులు చేశాడు. పంట దిగుబడులు రాలేదు. అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. దీంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.