నరసరావుపేట పట్టణంలో మంగళవారం భారీ ఎత్తున స్త్రీ శక్తి ఉచిత బస్సు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నియోజకవర్గ ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో చిలకలూరిపేటలో ఎమ్మెల్యే పుల్లారావుతో కలిసి ఆయన విషయం వెల్లడించారు. జగన్ పెన్షన్ 2వేల నుంచి 3 వేలకు పెంచడానికి 5ఏళ్ళు పట్టిందని కోటం ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలతో దూసుకుపోతుందని అరవింద్ బాబు చెప్పారు.