వేపాడ మండలం నీలకంఠ రాజాపురం దోపిడి దొంగ శుక్రవారం రెచ్చిపోయాడు.లెక్కల వెంకటలక్ష్మి తన తల్లితో కలిసి పొలంలో గడ్డి కోసుకొని వస్తుండగా రైవాడ కాలువ గట్టు వద్ద ముఖానికి మాస్క్ వేసుకొని ఉన్న దుండగుడు ఆమె మెడలో ఉన్న తులం ఉన్నారా బంగారు గొలుసును లాక్కుని పారిపోయాడు. వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకుని వల్లంపూడి ఎస్సై సుదర్శన్ పరిశీలించి కేసు నమోదు చేశారు.