కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని ఎన్జీవో కార్యాలయ ఆవరణలో శనివారం జమ్మలమడుగు సిఐటియు కార్యదర్శి దాసరి విజయ్ బెట్టింగ్ యాప్ లను బ్యాన్ చేయాలని తెలిపారు. ఈ సందర్బంగా విజయ్ మాట్లాడుతూ దేశ, రాష్ట్రాల వ్యాప్తంగా యువత జీవితాలను బెట్టింగ్ యాప్ లు ఛిద్రం చేస్తున్నాయని తెలిపారు. బెట్టింగ్ యాప్ ల వల్ల యువత చెడు వ్యసనాలకు లోనవుతున్నారన్నారు. ఈ యాప్ల వల్ల ఈజీ మనీకి అలవాటు పడి కొన్నిచోట్ల యువత ఆత్మహత్యలకు పాల్పడి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిలిస్తున్నారని అన్నారు. బెట్టింగ్ యాప్ లను బ్యాన్ చేసి, అక్రమంగా బెట్టింగ్ యాప్స్ను నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొవాలన్నారు.