నంద్యాల జిల్లా కోయిలకుంట్ల పరిధిలోని రేవనూరు PHCని AP ఫుడ్ కమిషన్ మెంబర్ దేవి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. PHCలో అనీమియాతో ఉన్న గర్భిణుల వివరాలను డాక్టర్ సుబహానిని అడిగి తెలుసుకున్నారు. హై రిస్క్ గర్భిణులు, కాన్పుల వివరాల రికార్డులు తనిఖీ చేశారు. తక్కువ హిమోగ్లోబిన్ ఉన్న ఇద్దరు గర్భిణులకు అంగన్వాడీ, ANM, ఆశాలు సమష్టిగా కలిసి పనిచేసి హిమోగ్లోబిన్ శాతం ఖచ్చితంగా పెంచేలా చర్యలు తీసుకోవాలని ICDS సూపర్వైజర్కు సూచించారు.