జన్యులోపంతో ఒక తల, ఆరు కాళ్లతో గొర్రె పిల్ల మృతి అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలంలోని కుంటలముందర కురవపల్లెకు చెందిన పశు కాపరి వెంకట సుబ్బయ్యకు చెందిన గొర్రెకు జన్యు లోపం కారణంగా గర్భంలోనే ఒక తల, ఆరు కాళ్లతో గొర్రె పిల్ల మృతి చెందింది. గొర్రెకు ప్రసవ సమయంలో ఇబ్బంది తలెత్తడంతో గ్రామానికి చెందిన పశువైద్యుడు ఓబులేసు వెంటనే వెళ్లి చికిత్స అందించారు. అయినప్పటికీ ఆ గొర్రె పిల్ల ప్రాణాలను కాపాడలేకపోయారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.