సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మునిసిపల్ పరిధిలో రోడ్డు పక్కన పడేసిన వ్యర్ధాలతో దుర్గంధం వెదజల్లుతుంది. పట్టణంలోని రాంనగర్ వైపు నుండి తాండూర్ వైపు వెళ్లే రహదారి పక్కన ప్లాస్టిక్ వ్యర్ధాలు, చెత్త, మాంసపు దుకాణాల వ్యర్థాలతోపాటు అస్తవ్యస్తంగా పారేశారు. దీంతో దుర్గంధం వెదజల్లుతూ ఆ రోడ్డు గుండా రాకపోకలు సాగించే వారికి ఇబ్బందికరంగా మారింది. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి చెత్తను తొలగించడంతోపాటు రోడ్డు పక్కన వ్యర్ధాలను పడవేయకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.