అవనిగడ్డ లో ఎదురుమొండి - గొల్లమంద వయా బ్రహ్మయ్య గారి మూల రహదారి నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన జరగనుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ హాజరయ్యేందుకు అంగీకరించారని, శంకుస్థాపన తేదీని త్వరలో ఖరారు చేస్తారని ఆయన చెప్పారు. నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి గురించి ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.