రాష్ట్రంలోని ఇమామ్, మౌజాంలకు గౌరవ వేతనం మంజూరు చేయాలని జిల్లా కాంగ్రెస్ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ షేక్ ఖాజా హుస్సేన్ డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి వెలువడిన పత్రిక ప్రకటనలో ఖాజా హుస్సేన్ మాట్లాడుతూ ఇమామ్, మౌజాంలకు 9 నెలల నుండి టీడీపీ ప్రభుత్వంలో గౌరవ వేతనాలు ఇవ్వడం లేదని గత ప్రభుత్వంలో ప్రతినెల వారి అకౌంటులో జమ అయ్యేవని వారికి ప్రతి నెల వేతనాలు అందే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చి వారి నిధులు విడుదల చేయాలని తెలియజేశారు