శుక్రవారం చిత్తూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశం అనంతరం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మీడియాతో మాట్లాడారు చిత్తూరు నగరాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చారని అదే చేస్తున్నానని చెప్పారు ఎన్ని ఆటంకాలు విమర్శలు వచ్చిన రోడ్ల విస్తరణ ఇతర అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు రోడ్లు మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉంటేనే నగరాలు అభివృద్ధి చెందుతాయని ఆ దిశగా చిత్తూరు నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ప్రైవేట్ సంస్థలు వ్యక్తులు పెట్టుబడి పెట్టేలా నగరాన్ని తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు.