ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని చెన్నకేశవ స్వామి సమీపంలో ఓ బంగారు దుకాణం నందు వెండి పట్టీలను కొనడానికి ఇద్దరు మహిళలు వెళ్లారు. ఆ సమయంలో ఇద్దరు మహిళలలో ఒక మహిళ వెండి పట్టీలను అపహరించారు. ఆ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుమారు 10 జాతలు 70 వేల రూపాయలు ఉంటుందని బంగారం దుకాణం యజమాని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.