రాష్ట్రంలో పరామర్శల పేరుతో వైసిపి నాయకులు అలజడులు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడిలో శుక్రవారం సాయంత్రం 4:00 సమయంలో జరిగిన స్త్రీ శక్తి విద్యుత్ సభలో ఆయన మాట్లాడారు. ఇష్టం వచ్చినట్లుగా విద్యుత్ ఛార్జీలు పెంచి ఇప్పుడు విద్యుత్ ధర్నాలు చేస్తున్నారని వైసీపీని ఎద్దేవ్ చేశారు రైతులకు ద్రోహం చేసి ఇప్పుడు రైతు ధర్నాలు చేయడం హాస్యాస్పదమని విమర్శించారు.