రాజవొమ్మంగి మండల కేంద్రం శివారున శనివారం సాయంత్రం జరిగిన రహదారి ప్రమాదంలో విశ్రాంత పోస్టల్ ఉద్యోగి ఎర్రినాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు కథనం ప్రకారం.. ఎర్రినాయుడు వట్టిగడ్డ నుంచి రాజవొమ్మంగి బైక్పై వస్తుండగా వెనుకనుంచి వచ్చిన కారు ఢీ కొట్టడంతో రోడ్డుపై పడ్డాడు. వెంటనే స్థానికులు స్పందించి అతనిని రాజవొమ్మంగి PHCకి తరలించి చికిత్స అందజేశారు.