Atmakur, Sri Potti Sriramulu Nellore | Sep 11, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, సంగం మండలం, సంగంలోని చెక్పోస్ట్ సెంటర్ సమీపంలోని ఫారెస్ట్ లో చెట్టుకు ఓ మృతదేహం వేలాడుతూ ఉండడాన్ని స్థానికులు గమనించారు. దీంతో స్థానిక పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహం ఆటో డ్రైవర్ రాముగా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హాస్పిటల్ కి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.