ఆదిలాబాద్ జిల్లాలో యూరియా కోసం అన్నదాతలు ఆగచాట్లు పడుతున్నారు. యూరియా బస్తా కావాలంటే పనులన్నీ వదులుకొని పొద్దు పొడవక ముందే యూరియా పంపిణీ కేంద్రాల వద్ద పడి కాపులు కాయాల్సి వస్తోంది. ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల్లో యూరియా కొరత ఇబ్బందులు నెలకొనగా, తాజాగా ఇచ్చోడ లో సైతం రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని పంపిణీ కేంద్రం వద్దగురువారం ఉదయం నుండి యూరియా బస్తాలు కోసం క్యూ లైన్ లో నిలబడ్డ యూరియా వెతలు తీరడం లేదు. డిమాండ్ కంటే తక్కువగా యూరియా సరఫరా జరగడంతోనే ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు వాపోతున్నారు.