Download Now Banner

This browser does not support the video element.

ములుగు: చిన్నబోయినపల్లి-తాడ్వాయి మధ్య వ్యానును ఢీకొన్న ఇసుక లారీ, ముగ్గురికి గాయాలు

Mulug, Mulugu | Aug 25, 2025
ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి- తాడ్వాయి మధ్య సోమవారం సాయంత్రం ఓ వ్యానును లారీ ఢీకొట్టింది. స్థానికుల వివరాలు.. ఇసుక లోడుతో ములుగు వైపు వెళ్తున్న లారీ, ఏటూరునాగారం వైపు వస్తున్న మినీ వ్యానును ఢీకొట్టిందన్నారు. ఈ ప్రమాదంలో వ్యానులోని ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై రాజ్ కుమార్ క్షతగాత్రులను ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us