కంకిపాడు ఇంచార్జ్ సీఐ రామారావు తెలిపిన వివరాల ప్రకారం, ఉయ్యూరు మండలం కలవపాముల గ్రామంలో నకిలీ అనుమతి పత్రాలను సృష్టించి అక్రమంగా ఎరువుల దుకాణం నడుపుతున్న దూబామాలపల్లికి చెందిన కలవపాముల దిలీప్, కలవపాముల పవన్ కుమార్ అనే ఇద్దరిని మంగళవారం అరెస్ట్ చేశారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సురేష్ బాబు పాల్గొన్నారు.