యాడికి మండలం కత్తిమాను పల్లి గ్రామంలో ఓబులేసు అనే రైతుకు చెందిన నిమ్మ తోటలో బుధవారం విద్యుత్తు ప్రమాదం జరిగింది. విద్యుత్ వైర్లు ఒకదానికొకటి తాకిడికి గురి కావడంతో మంటలు చెలరేగాయి. మంటల్లో సుమారు 25 నిమ్మ చెట్లు కాలిపోయినట్లు బాధిత రైతు ఓబులేసు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సంఘటనపై బాధిత రైతు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. విద్యుత్ అధికారులు నిమ్మ తోటను పరిశీలించారు.