శనివారం మధ్యాహ్నం TS CPS ఈయూ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గద్వాల జిల్లా అధ్యక్షులు కే బుచ్చన్న ఆధ్వర్యంలో మల్దకల్ మండల కేంద్రంలోని ఎంఆర్వో కార్యాలయ ఆవరణలో జీవో 28 ప్రతులను దహనం చేయడం జరిగింది. బుచ్చన్న మాట్లాడుతూ - తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకు సి.పి.ఎస్.విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించుకునే సువర్ణ అవకాశాన్ని కాలరాస్తూ కనీసం ఉద్యోగులతో గానీ ఉద్యోగ సంఘాలతో గాని చర్చించకుండా నిరంకుశ ధోరణితో ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఆగస్ట్ 23, 2014న జివో 28 తీస్తూ మేము సి.పి.ఎస్. విధానంలోనే కొనసాగించాలని డిమాండ్.