మధురవాడ-భీమిలి రహదారిపై సోమవారం రాత్రి మద్యం మత్తులో ఒక యువకుడు చేసిన వీరంగం కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఓ కారులో అతివేగంగా ప్రయాణిస్తున్న యువకుడు అకస్మాత్తుగా రోడ్డు మధ్యలో వాహనాన్ని ఆపి, తోటి ప్రయాణికులతో వాగ్వాదానికి దిగాడు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.