కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని యర్రగుంట్ల మండలం చిలంకూరు గ్రామంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని జరిగిన ఈ ప్రమాదములో చిరాజుపల్లి, మరియు దండుపల్లె గ్రామాలకు చెందిన వ్యక్తులకు గాయలైనట్లు తెలిపారు. విషయం తెల్సిన వెంటనే జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి ప్రమాద స్థలానికి చేరుకొని క్షతగాత్రులను పొద్దుటూరు ప్రభుత్వ హాస్పిటల్ కు చేర్పించారు. అక్కడనుండి వారిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు కు తరలించడం జరిగింది. నిఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సింది.